Bhu Bharathi | పెద్దపల్లి రూరల్ , జూలై 24 : రెవెన్యూ సదస్సుల ద్వారా వచ్చినభూ భారతి దరఖాస్తులను వేగవంతంగా పరిష్కరించాలని పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. జిల్లా కేంద్రంలోని మండల తహసీల్దార్ కార్యాలయాన్ని ఆయన గురువారం తనిఖీ చేశారు. రిజిస్ట్రేషన్ ల ప్రక్రియను పరిశీలిస్తూ అందుకు సంబంధించిన పలు విషయాలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన భూ సమస్యల దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలన్నారు. ఆదివారం నాటికి ప్రతీ దరఖాస్తుకు నోటీసు జనరేట్ చేయాలని, ప్రతీ రోజూ కనీసం 20 దరఖాస్తులు డిస్పోస్ చేయాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ దండిగ రాజయ్య యాదవ్, నాయిబ్ తహసీల్దార్ విజేందర్, రాజిరెడ్డి, కార్యాలయ అధికారులు, సిబ్బంది ఉన్నారు.