NTPC | జ్యోతినగర్, జూలై 6: పర్యావరణ పరిరక్షణ కోసం ఎన్టీపీసీలోని శ్రీ భగవతీ యూత్ అధ్యక్షుడు కొంకటి రవిగౌడ్ ఆధ్వర్యంలో ఆదివారం ఎన్టీపీసీ ష్టానగర్లో పెద్ద ఎత్తున హరితహారం కార్యక్రమాన్ని చేపట్టారు. కాలనీలోని ఖాళీ ప్రదేశాల్లో దాదాపు 250 మొక్కలు నాటారు. కాలనీవాసులకు వివిధ రకాల మొక్కలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా యూత్ అధ్యక్షుడు కొంకటి రవిగౌడ్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలు నాటి వాటిని రక్షించాలన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ భగవతీ యూత్ సభ్యులు, కాలనీవాసులు వొల్లాల సురేశ్, మామిడాల చంద్రయ్య, రాంపెల్లి శ్రీనివాస్, మాచిడి హేందరౌడ్, పైడసాయి, సాయినాథ రెడ్డి, బుద్దే సతీశ్, బత్తిని శేఖర్ గౌడ్, శివ, డాలియా, జుగల్, సునీల్, మనియార్, మామిడాల గణేశ్, మాదాది పవన్, రామ్మోహన్ గౌడ్, రాజయ్య, ఉన్నారు.