KDCCB | సుల్తానాబాద్, మే 23.. పట్టణంలో రూ.2. 50 కోట్లతో నూతనంగా నిర్మించిన కేడిసిసి బ్యాంకులో ఖాతాదారులకు ఇకనుంచి మెరుగైన సేవలు అందుతాయని పెద్దపెల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అన్నారు. నూతనంగా ఏర్పాటైన సుల్తానాబాద్ శాఖను నాప్ క్యాబ్, కేడిసిసిబి చైర్మన్ కొండూరి రవీందర్రావు తో కలిసి పెద్దపల్లి ఎమ్మెల్యే శుక్రవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం రైతుల కోసం సొసైటీల ద్వారా అనేక కార్యక్రమాలను నిర్వహిస్తుందన్నారు. వరి కొనుగోలు చెల్లింపుల్లో పెద్దపెల్లి జిల్లా ముందు వరుసలో ఉందన్నారు. రైతులకు ఎలాంటి కటింగులు లేకుండా వరి కొనుగోలు చేశామన్నారు, నూతన శాఖతో రైతులకు బ్యాంకు సిబ్బంది మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో బ్యాంకు సేవలు అందించే అవకాశం ఉంటుందన్నారు. పెద్దపెల్లి జిల్లాలోని అన్ని సొసైటీలో సీఈవో వల్ల బాధ్యతలు నిర్వహిస్తున్న వారిని ఇక్కడి నుండి ట్రాన్స్ఫర్లు చేయవద్దని సూచించారు.
నాప్ క్యాబ్ కేడీసీసీబీ చైర్మన్ కొండూరు రవీందర్రావు మాట్లాడుతూ అతి గతి లేని స్థాయి నుంచి జిల్లాలోని అన్ని సొసైటీలను బలోపేతం చేశామన్నారు దేశంలోనే జిల్లా మొదటి స్థానంలో ఉందన్నారు. మన సొసైటీల ద్వారా రైతులకు అందుతున్న సేవలను గుర్తించి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచి పరిశీలించేందుకు మన రాష్ట్రానికి వస్తున్నారని జిల్లావ్యాప్తంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎనిమిది పాయింట్ 50 లక్షల మంది ఖాతాదారులు ఉన్నారని రూపాయలు రూ.3000 కోట్ల డిపాజిట్లు ఉన్నాయని తెలిపారు.
గత 21 సంవత్సరాలుగా బాధ్యతగా వ్యవహరించి ప్రత్యేక గుర్తింపును తీసుకువచ్చినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్, ఏఎంసీ చైర్మన్ మినపల ప్రకాష్ రావు, కేడీసీసీబీ ఉపాధ్యక్షుడు పింగిలి రమేష్, సింగిల్ విండో చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్, పుచ్చిడి మోహన్ రెడ్డి, దేవరనేని మోహన్ రావు, గోపాలరావు, కేడీసీసీబీ సీఈవో సత్యనారాయణ, డిసిఓ శ్రీ మాల, డీజీఎం బ్రహ్మానందరావు, ఏటీఎం గూడ మహేష్, సూపర్వైజర్ సాగర్ రెడ్డి, సంఘ సీఈవో సంతోష్, శంకరయ్య, రమేష్ తదితరులు ఉన్నారు.