cyber crimes | సుల్తానాబాద్ రూరల్ నవంబర్ 6: సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్సై అశోక్ రెడ్డి అన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో వాకర్స్ తో గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై అశోక్ రెడ్డి మాట్లాడుతూ రోజురోజుకు పెరుగుతున్న సైబర్ నేరాలపై ప్రతీ ఒక్కరికి అవగాహన కలిగి ఉండాలని అన్నారు.
కొత్త పద్ధతుల ద్వారా సైబర్ క్రైమ్ జరుగుతుందని ప్రజలు గమనించాలని సూచించారు. అనుమానిత వ్యక్తుల కు మనకు సంబంధించిన సమాచారం ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వద్దన్నారు. ఓటీపీలు వచ్చాయని వాటిని చెప్పాలని మనలను బోల్తా కొట్టిస్తారని చెప్పారు. అన్ని విషయాలను గమనించి అనుమానం ఉన్నట్లయితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో కానిస్టేబుల్స్, సంపత్, మునిందర్, అలీ తోపాటు వాకర్స్ తదితరులు పాల్గొన్నారు.