Vemulawada | వేములవాడ, మార్చి 22: వేసవికాలంలో వచ్చే అగ్ని ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండాలని వేములవాడ అగ్నిమాపక కేంద్రం ఇంచార్జ్ అధికారి శంకర్ అన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా వేములవాడ పట్టణంలోని ప్రైవేట్ ఆసుపత్రులలో అగ్ని ప్రమాదాల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆదివారం అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ వారం రోజులపాటు ఆసుపత్రుల్లోలలో అగ్ని ప్రమాదాలపై తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చేపట్టాల్సిన చర్యలపై అవగాహన కల్పిస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది కే చంద్రశేఖర్, బీ భాస్కర్, జే ప్రేమ్ చంద్, జీవన్, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.