BC Reservations | పెగడపల్లి: బీసీలకు జనాభా ప్రాతిపదిక రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ పెగడపల్లి మండల కేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తా వద్ద మండల బీసీ సంఘం నాయకులు శనివారం రిలే నిరహార దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం మండల అధ్యక్షుడు నీరటి రాజ్ కుమార్ మాట్లాడుతూ బీసీల జనభా ప్రతిపాదికన రిజర్వేషన్లు కల్పించే వరకు వరకు తమ పోరటం ఆగదన్నారు.
ఈ పోరాటానికి పార్టీలకతీతంగా బీసీ నాయకులు మద్దతు ప్రకటించి రిజర్వేషన్లు సాధించుకునే వరకు పోరటం కొనసాగించాలని రాజ్‌కుమార్ కోరుతూ, ఐదు రోజుల పాటు రిలే దీక్షలు కొనసాగుతాయన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం జేఏసీ నాయకులు తిర్మణి నర్సింహరెడ్డి, చిందం తిరుపతి, కడారి తిరుపతి, గంగుల కొమురెల్లి, గర్వంద శేఖర్ గౌడ్, బండారి బీరయ్య, నెల్లి మల్లేశం, ముల్క రాజేశం, తౌటు గంగాధర్, గొల్లపల్లి రాంచంద్రం, బొడ్డు రమేశ్, పెద్ది బీరయ్య, గొల్లపల్లి నాగరాజు, అడెపు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.