Renikunta tollgate | తిమ్మాపూర్, అక్టోబర్ 18: తిమ్మాపూర్ మండల వ్యాప్తంగా బీసీ బంద్ ప్రశాంతంగా జరిగింది. అన్ని పార్టీలకు చెందిన బీసీ నేతలు రేణిగుంట లోని టోల్గేట్ వద్ద నుండి పదుల సంఖ్యలో బైకులపై ర్యాలీగా అలుగునూర్ చౌరస్తా వరకు చేరుకొని ధర్నా చేశారు. రోడ్డును స్తంభింపజేసి నినాదాలు చేశారు. 42 శాతం బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. అన్ని గ్రామాల్లో దుకాణాలు మూసి వేయించారు.
పాఠశాలలను బంద్ జేసి పిల్లలను పంపించారు. ప్రభుత్వ కార్యాలయాలను అడ్డుకున్నారు. అల్గునూరులో రోడ్డును దిగ్బంధనం చేసిన నేతలను ఎల్ఎండీ ఎస్ఐ శ్రీకాంత్ అదుపులోకి తీసుకొని ట్రాఫిక్ క్లియర్ చేశారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు ఉల్లెంగుల ఏకానందం, వివిధ పార్టీల మండల అధ్యక్షులు రావుల రమేష్, బండారి రమేష్, నాయకులు లక్ష్మీనారాయణ గౌడ్, మాచర్ల అంజయ్య , వేల్పుల ఓదెలు యాదవ్, పొన్నం అనిల్, పోలు రామురమేష్, శివరామకృష్ణ, మండల బీసీ నేతలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.