National BC Association | పెగడపల్లి: జగిత్యాల జిల్లా పెగడపల్లి మండల జాతీయ బీసీ సంక్షేమసంఘం అధ్యక్షుడు నీరటి రాజ్ కమార్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో అంబేద్కర్ కూడలి వద్ద పెద్ద ఎత్తున బీసీ సంఘాల నాయకులు పాల్గొని నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించేలా జారీ చేసిన జీవో 9 పై హైకోర్టు స్టే విధించడం పట్ల బీసీ సంఘాల నాయకులు నిరసన వ్యక్తం చేస్తూ తీవ్రంగా ఖండించారు.
రాబోయే కాలంలో బీసీల రాజ్యాధికారం కోసం బీసీలంతా ఏకమై ముకుమ్మడిగా బీసీ రిజర్వేషన్ల ప్రక్రియ ముందుకు సాగేందుకు ఒత్తిడి తీసుకురావాలని ప్రతి ఒక్కరూ ముందుకు సాగి త్వరలో బీసీల సత్తా ఏంటో చూపిస్తామని పలువురు నాయకులు ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఏదైతే ఇప్పటివరకు బీసీలకు రావలసిన జనాభా ప్రాతిపదికన బీసీలకు రిజర్వేషన్లు కల్పించే పక్రియను ఎవరైతే అడ్డుకుంటున్నారో వారికి అగ్రవర్ణాల పోకడను మానుకోవాలని బీసీ సంఘం అధ్యక్షుడు రాజ్ కుమార్ హితవు పలికారు. కొంతమంది బీసీలకు పదవులు వస్తుంటే కొంతమంది ఓర్వలేక పోతున్నారని మండిపడ్డారు.
ఈ కార్యక్రమంలో మండల బీసీ సంఘం ప్రధాన కార్యదర్శి గర్వందుల శేఖర్ గౌడ్, బీసీ సంఘం గౌరవ అధ్యక్షుడు బండారి బీరయ్య, బీసీ సంఘం సలహాదారుడు ముల్క రాజేశం, మాజీ సింగిల్ విండో చైర్మన్ చిందం తిరుపతి, మాజీ సహకార సంఘం డైరెక్టర్ తోట మల్లేశం, కోశాధికారి గంగుల కొమురెల్లి, వరద రాము, చెట్ల తిరుపతి, పుల్కం జలపతి, బాదినేని మల్లయ్య, గొల్లపల్లి రామచంద్రం, కొత్తపెళ్లి భాస్కర్, గర్వందుల రాజ గౌడ్, పలుమారు అంజయ్య నాంపల్లి రమణాచారి, అంగలి సంతోష్ బీసీ సంఘాల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.