Thimmapur | తిమ్మాపూర్, సెప్టెంబర్20: తిమ్మాపూర్ మండల కేంద్రంలోని శ్రీ శ్రీనివాస రామానుజన్ పాఠశాలలో ముందస్తు బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. విద్యార్థులు తెలంగాణ సాంప్రదాయం ప్రకారం పూలు పేర్చి బతుకమ్మ ఆడి పాడారు.
రాష్ట్ర సంస్కృతి సంప్రదాయాలు పిల్లలకు తెలియాలని ఉద్దేశంతో ముందస్తు బతుకమ్మ వేడుకలు నిర్వహించినట్లు పాఠశాల కరస్పాండెంట్లు బర్మయ్య, జితేందర్ తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.