విద్యానగర్, మే 17: పట్టణాల నుంచి పల్లె ల వరకు సత్వర వైద్య సహాయాన్ని అందించి ఆరోగ్య తెలంగాణను సాధించే దిశగా బస్తీ దవాఖానలను ఆచరణలోకి తీసుకువచ్చామని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మం త్రి గంగుల కమలాకర్ తెలిపారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని పద్మనగర్‌లో రూ. 21.30 లక్షలతో ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానను మంత్రి గంగుల కమలాకర్ బుధవారం ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ, గతంలో ప్రభుత్వ దవాఖానల్లో వైద్యం అంటే నే భయపడే రోజులుండేవని, ఇ ప్పుడు కార్పొరేట్ దవాఖానలకు దీటుగా సకల వసతులు, సదుపాయాలను సర్కారు దవాఖానల్లో కల్పిస్తున్నామని తెలిపారు. ప్రజల్లో ప్ర భుత్వ వై ద్యంపై బలమైన నమ్మకాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఆరోగ్య తెలంగాణ దిశగా ప్రతి 10వేల మందికి ఒక బస్తీ దవాఖానను ఏర్పా టు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు.
బస్తీ దవాఖానలో ఒక డాక్టర్, ఒక స్టాఫ్ నర్స్, ఒక నర్స్‌తో పాటు, మందులు, రోగనిర్ధారణ పరీక్షలు అందుబాటులో ఉంటాయన్నారు. బస్తీ దవాఖానాను ప్రారంభించిన అనంతరం మంత్రి, మే యర్ వైద్యపరీక్షలు చేయించుకున్నారు. తదుపరి బస్తీ దవాఖానను ఆనుకొని ఏర్పాటు చేసి న యో గా కేంద్రాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో కలెక్టర్ ఆర్వీ కర్ణన్, మేయర్ వై సునీల్ రావు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి లలితాదేవి, కార్పొరేటర్లు బోనాల శ్రీకాంత్, గందె మాధవి, గుగ్గిళ్ల జయశ్రీ, కరీంనగర్ బల్దియా కమిషనర్ సేవా ఇస్లావత్, తహసీల్దార్ వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.