Bandi Sanjay | కథలాపూర్, జూలై 11 : కథలాపూర్ మండలంలోని గ్రామాల్లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ పుట్టినరోజు వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. గ్రామాల్లోని ప్రధాన కూడళ్ల వద్ద కేకులు కట్ చేశారు.
మండలంలోని పోచారం గ్రామంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పెన్నులు, కంపాస్ బాక్సులు, అరటిపండ్లు పంపిణీ చేశారు. తండ్రియాలలో గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు మల్యాల మారుతి గౌడ్, నాయకులు ధర్మపురి జలంధర్, పాలెపు నరేష్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.