Bakrid | పెద్దపల్లి కమాన్, జూన్ 7 : బక్రీద్ పర్వదినం సందర్భంగా శనివారం ముస్లింలు భక్తి శ్రద్దలతో వేడుకలను జరుపుకున్నారు. పెద్దపల్లి మున్సిపల్ పరిది చందపల్లి ఈద్గా వద్ద ముస్లింలు పెద్ద సంఖ్యలో ప్రార్ధనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మత పెద్దలు మహమ్మద్ ప్రవక్త భోదనలు వివరించారు.
పలువురు ప్రజా ప్రతినిధులు ముస్లింల ను ఆలింగనం చేసుకొని పండగ శుభాకాంక్షలు తెలిపారు. అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పెద్దపల్లి పోలీసులు బందొబస్త్ నిర్వహించారు.