కోరుట్ల, అక్టోబర్ 21: న్యాయవాదుల సంక్షేమానికి తన వంతు కృషి చేస్తానని ఫెడరేషన్ అఫ్ బార్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ బైరి విజయ్ కుమార్ అన్నారు. ఇటీవల హైదరాబాద్ లోని నాంపల్లి క్రిమినల్ కోర్ట్ బార్ అసోసియేషన్ హాల్ లో జరిగిన తెలంగాణ రాష్ట్ర బార్ అసోసియేషన్ ఫెడరేషన్ ఎన్నికలలో కోరుట్ల బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బైరి విజయ్ కుమార్ ఫెడరేషన్ ఆఫ్ బార్ అసోసియేషన్ తెలంగాణ జాయింట్ సెక్రటరీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ఈ సందర్భంగా పట్టణంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ న్యాయ వాదుల ఐక్యత, న్యాయ వ్యవస్థ బలోపేతానికి, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న న్యాయవాదుల సంక్షేమానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. తన ఎన్నికకు సహకరించిన తెలంగాణ బార్ అసోసియేషన్ అధ్యక్షులు, సభ్యులు, సహచర న్యాయవాదులకు విజయ్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు.