BadiBata | కాల్వ శ్రీరాంపూర్. మే 7 : కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని వెన్నంపల్లి ,మల్యాల, ఎద్దులాపూర్ గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలల ఆధ్వర్యంలో శనివారం బడిబాట కార్యక్రమం నిర్వహించారు. బడిబాట కార్యక్రమంలో భాగంగా వెన్నంపల్లిలో ఆరో తరగతిలో ఇద్దరు విద్యార్థులు నూతనంగా అడ్మిషన్ ఇచ్చారు.
ప్రభుత్వ పాఠశాల లలో మౌలిక వసతులు, డిజిటల్ తరగతి గదులు, పౌష్టిక మధ్యాహ్న భోజనం, రెండు జతల యూనిఫామ్స్, టెక్ట్స్ బుక్స్, నోట్ బుక్స్ ప్రభుత్వం ఉచితంగా అందిస్తుందని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు పీఆర్ దయా, పోచయ్య, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, సీఆర్పీ కుర్మశెట్టి చందర్ తదితరులు పాల్గొన్నారు.