KTR | వీర్నపల్లి, మే11: బిడ్డా బాపు పాణం బాగున్నదా.. అంటూ ఓ మహిళ కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను అడిగి తెలుసుకున్నది. వీర్నపల్లి మండలం శాంతినగర్ గ్రామంలో ఓ వివాహ వేడుకకు హాజరైన కేటీఆర్ ను చూడగానే అదే గ్రామానికి చెందిన అలువల అంజవ్వ అనే మహిళ భావద్వేగానికి గురైంది.
రామన్నను ఒక్కసారిగా హత్తుకొని నువ్వు నా బంగారానివి బిడ్డా…నిన్ను చూడక ఎన్ని రోజులైతాంది. అంటూ కన్నీరు పెట్టుకుంది. గతంలో నా పాణం బాగా లేకుంటే బాపు పైసలు పంపించిండు అంటూ గుర్తుచేసుకుంది.