Peddapally | పెద్దపల్లి : దేశంలోని అణగారిన వర్గాల కోసం అర్థ శతాబ్దపు కాలం సబండ వర్గాల అభివృద్ధి కోసం ఎనలేని కృషి చేసిన సమతావాది డాక్టర్ జగ్జీవన్ రామ్ అని, ఆయన అందించిన స్ఫూర్తితో మహనీయుల ఆశయ సాధనకు కృషి చేయాలని పెద్దపెల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పేర్కొన్నారు.
బాబు జగ్జీవన్ రామ్ జీవితమంతా దేశ సేవకు అంకితం చేసి నవభారత నిర్మాణంలో అర్థ శతాబ్దపు దళితుల అభ్యున్నతికి కృషి చేశారని కొనియాడారు. అటువంటి మహానుభావుని 118 వ జయంతి వేడుకలను జరుపుకోవడం గర్వకారణమన్నారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వేణు, దళిత సంఘాల నాయకులు, టీఎన్జీవో సంఘం నాయకులు, బొంకూరు కైలాసం, మామిడిపల్లి బాపయ్య, బొంకూర్ శంకర్, మాటూరు దుర్గయ్య, నేతరి ప్రభాకర్, పోగుల శేఖర్, రామలక్ష్మి, మల్లేష్, లక్ష్మణ్, కళ్ళెపెల్లి అశోక్, శ్రావణ్, ప్రశాంత్, రవీందర్, తదితరులు పాల్గొన్నారు.