Awareness seminar | ధర్మారం, సెప్టెంబర్ 12: పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని నందిమేడారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ సుస్మిత నేతృత్వంలో జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ మహిళ సాధికారిక కేంద్రం, జిల్లా బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం వేర్వేరుగా స్థానిక పిహెచ్సి ధర్మారం మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో బాలల పరిరక్షణ అవగాహన సదస్సును నిర్వహించారు.
ఈ సందర్భంగా బాలల సంరక్షణ అధికారి నిర్మల మాట్లాడుతూ పీసీపీఎన్డీటీ చట్టం, బాలల హక్కుల చట్టాలు, పని ప్రదేశాలలో మహిళల పై వేధింపుల చట్టంపై అవగాహన కల్పించారు. తల్లిదండ్రులు తమ కూతుర్లను తప్పకుండా బడికి పంపించి చదివించాలని ఆమె సూచించారు. బాలలపై లైంగిక వేధింపులకు పాల్పడితే పొక్సో చట్టం ద్వారా వారిపై కఠిన చర్యలు తీసుకుంటారని ఆమె వివరించారు . ఎట్టి పరిస్థితుల్లోనూ బాలికలకు బాల్య వివాహాలు చేయరాదని వాటిని అరికట్టడం అందరి బాధ్యత అని ఆమె పేర్కొన్నారు.
బాలికలకు ఏదైనా ఇబ్బందులు ఉంటే చైల్డ్ హెల్ప్ లైన్ ను సంప్రదించాలని ఆమె సూచించారు . ఎట్టి పరిస్థితుల్లోనూ మొబైల్ ను బాలికలు వాడకూడదని వాటితో సైబర్ నేరాలతో చిక్కుకునే అవకాశం ఉందని ఆమె హెచ్చరించారు. బాల బాలికలు మాదకద్రవ్యాల కు దూరంగా ఉండి తమ ఉజ్వల భవిష్యత్తును కాపాడుకోవాలని ఆమె సూచించారు.
అత్యవసర సమయంలో అవసరమయ్యే హెల్ప్ లైన్ నెంబర్ లపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ధర్మారం జడ్పీ ఉన్నత పాఠశాల హెడ్మాస్టర్ షీల, నంది మేడారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది, కౌన్సిలర్ వెంకటస్వామి, చైల్డ్ హెల్ప్ లైన్ వర్కర్ కల్పన తదితరులు పాల్గొన్నారు.