CPR | కోరుట్ల, జూలై 12: పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో రేనే హాస్పిటల్ ఆధ్వర్యంలో ఆర్ఎంపీ, పీఎంపీలకు సీపీఆర్ విదానంపై అవగాహన, శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా ఐఎంఏ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ అనూప్ రావు, పట్టణాధ్యక్షుడు డాక్టర్ రేగొండ రాజేష్ సీపీఆర్ పై అవగాహన కల్పించారు.
సీపీఆర్ విధానంపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలన్నారు. సీపీఆర్ చేయడం ద్వారా కార్డియక్ సమస్యలతో వచ్చే మరణాలను అదుపు చేయవచ్చన్నారు. సీపీఆర్ విధానం ద్వారా గుండెకు రక్త ప్రసరణ సాఫీగా జరుగుతుందని, నోటి ద్వారా ఆక్సిజన్ అందించడం వల్ల ప్రాణాలను రక్షించవచ్చన్నారు. ప్రథమ చికిత్స నిర్వహించే ఆర్ఎంపీలు తమ పరిధికి మించి చికిత్సలు చేయవద్దని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఐఎంఏ పట్టణ కార్యదర్శి డాక్టర్ జగదీశ్వర్, డాక్టర్ అన్వేష్, డాక్టర్ సమీర్, ఆర్ఎంపీ పట్టణాధ్యక్షులు సందా శ్రీపతి, సిద్ధిఖ్ ఆలీ, అబ్దుల్లా, కొక్కుల శ్రీనివాస్, సాంబారి అశోక్, రామ్మోహన్, గంగాధర్, అశోక్, నజీబ్ ఉల్లా, తదితరులు పాల్గొన్నారు.