ఈసీ మార్గదర్శకాల పరిధిలోనే విధులు నిర్వర్తించాలి: తహసీల్దార్ రాజయ్య యాదవ్
కేంద్ర ఎన్నికల కమిషన్ నిబంధనలకు అనుగుణంగా విధులు నిర్వర్తించాలని పెద్దపల్లి తహసీల్దార్ దండిగ రాజయ్య యాదవ్ అన్నారు. ఎన్నికల నిబంధనలు, నిర్వహణ తీరుపై బీఎల్వోలు, సిబ్బందికి పెద్దపల్లి తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
పెద్దపల్లి రూరల్, జూలై 5: కేంద్ర ఎన్నికల కమిషన్ నిబంధనలకు అనుగుణంగా విధులు నిర్వర్తించాలని పెద్దపల్లి తహసీల్దార్ దండిగ రాజయ్య యాదవ్ అన్నారు. ఎన్నికల నిబంధనలు, నిర్వహణ తీరుపై బీఎల్వోలు, సిబ్బందికి పెద్దపల్లి తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈసీ ఆదేశాల మేరకు పెద్దపల్లి మండలంలోని బూత్ స్థాయి అధికారులకు, సూపర్ వైజర్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించామన్నారు.
ఇందులో ప్రధానంగా ఫామ్-6, ఫామ్-7, ఫామ్-8పై విచారణ, నివేదిక సమర్పించడం, బూత్ లెవల్ అధికారి ఆప్ వాడకం, ఓటర్ల జాబితా సవరణపై అవగాహన కల్పించామని వెల్లడించారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల పరిధిలోనే విధులు నిర్వర్తించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నాయిబ్ తహసీల్దార్ విజేందర్, ఎన్నికల విభాగం నాయిబ్ తహసీల్దార్ రవిందర్, మాస్టర్ ట్రైనర్లుగా హెచ్ఎంలు పురుషోత్తం, ఆగయ్య, తహశీల్దార్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

