Dharmaram | సమతుల ఎరువుల వినియోగంపై బొట్లవనపర్తి రైతులకు అవగాహన
రామగిరి ఖిల్లా కృషి విజ్ఞాన కేంద్రం, వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో సంయుక్తంగా శుక్రవారం ధర్మారం మండలం బొట్లవనపర్తి గ్రామంలో సమతుల ఎరువుల వినియోగంపై రైతులకు అవగాహన కార్యక్రమం ను నిర్వహించారు.
Dharmaram | ధర్మారం, మే15 : రామగిరి ఖిల్లా కృషి విజ్ఞాన కేంద్రం, వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో సంయుక్తంగా శుక్రవారం ధర్మారం మండలం బొట్లవనపర్తి గ్రామంలో సమతుల ఎరువుల వినియోగంపై రైతులకు అవగాహన కార్యక్రమం ను నిర్వహించారు. వచ్చే వానాకాలంలో పంటలు సాగు చేయనున్న నేపథ్యంలో రైతులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు .ఈ సందర్భంగా ఆర్ కే కే వి కే శాస్త్రవేత్త డాక్టర్ కిరణ్ రైతులకు పలు సలహాలు సూచనలు ఇచ్చారు. ముఖ్యంగా స్థూల పోషకాలైన నత్రజని, భాస్వరం , పొటాష్ లను వరి పొలంలో ఎలా వినియోగించాలో వాటి ప్రాముఖ్యత గురించి ఆయన వివరించారు. వరి సాగు చేయడానికి ముందుగా భూమిలో పోషకాల పెంపు కోసం పచ్చిరొట్ట ఎరువులైన జనుము, జీలుగా విత్తనాలు సాగు చేయాలని ఆయన సూచించారు.
సేంద్రియ ఎరువుల వాడకం ను పంట క్షేత్రంలో పెంచుకోవాలని ఆయన సూచించారు. అలాగే భూసార పరీక్ష ప్రాముఖ్యతను, సేకరణ విధానం గురించి శాస్త్రవేత్త కిరణ్ రైతులకు వివరించారు .కృషి విజ్ఞాన కేంద్రంలో జిల్లాలోని రైతులకు క ఉచితంగా భూసార పరీక్షలు నిర్వహిస్తూ దానికి సంబంధించిన పరీక్ష కార్డులను పంపిణీ చేస్తున్నామని శాస్త్రవేత్త కిరణ్ తెలిపారు. ఆయిల్ పామ్ లో యాజమాన్య పద్ధతులు ఆయన ఈ సందర్భంగా వివరించారు. యాసంగి వరి పంటలను పోసిన తర్వాత వరి కొయ్యలను కాల్చకుండా నెలలో కలియ దున్నితే సేంద్రియ ఎరువుగా మారి పంటలకు ఎంతో గాను ఉపయోగపడుతుందని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సంగ రంజిత్ కుమార్ యాదవ్ ,ఉప సర్పంచ్ మోట పలుకుల సత్యనారాయణ, వార్డు మెంబర్లు, వ్యవసాయ విస్తరణ అధికారి సుష్మా, రైతులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

