Kachireddypally | గంగాధర, మార్చి 20 : గంగాధర మండలం కాచిరెడ్డిపల్లిలో రోడ్డు సేఫ్టీ పై గ్రామస్తులకు అవగాహన కల్పించినట్లు ఎస్సై వంశీకృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలు జరగడానికి ప్రధాన కారణం ప్రజలు ట్రాఫిక్ నిబంధనలను పాటించకపోవడమేనని పేర్కొన్నారు. వాహనదారులు ట్రాఫిక్ నియమాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, నాలుగు చక్రాల వాహనదారులు సీట్‌బెల్ట్ వినియోగించాలని సూచించారు.
మద్యం సేవించి వాహనం నడపడం ప్రమాదకరమని, అధిక వేగంతో వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు పెరుగుతున్నాయి పేర్కొన్నారు. వాహనం నడుపుతున్నప్పుడు మొబైల్ ఫోన్ లో మాట్లాడటం ప్రమాదకరమన్నారు. ట్రాఫిక్ సిగ్నల్స్, రోడ్డు సూచికలను గౌరవించాలని, వేగ నియంత్రణ పాటించడం ద్వారా ప్రమాదాలను తగ్గించవచ్చని సూచించారు.
ప్రతీ పౌరుడు రోడ్డు భద్రతపై బాధ్యత వహించాలని, ట్రాఫిక్ సిగ్నల్స్‌ను గౌరవిస్తూ వాహనాలు నడపడం ప్రతి పౌరుని కర్తవ్యమని పేర్కొన్నారు. అనంతరం రోడ్డు భద్రతకు సంబంధించిన వాల్ పోస్టర్‌ను గ్రామస్తులతో కలిసి ఆవిష్కరించారు. కార్యక్రమంలో సర్పంచ్ కోల మమతరాణి శ్రీనివాస్, గ్రామస్తులు పాల్గొన్నారు.