Awareness | సుల్తానాబాద్ రూరల్, ఫిబ్రవరి 5 : సుల్తానాబాద్ మండలంలోని దుబ్బ పల్లి గ్రామపంచాయతీ కార్యాలయం ఆవరణలో గర్రెపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో కుష్టి వ్యాధి పై గ్రామస్తులకు అవగాహన వైద్యాధికారులు గురువారం కల్పించారు. ఈ సందర్భంగా తెలుపు రంగు, ఎరుపు రంగు మచ్చలు, తదితర విషయాలపై వివరించారు.
ఎవరికైనా అలాంటి లక్షణాలున్నట్లయితే సమీప వైద్యులను సంప్రదించి వైద్యం తీసుకోవాలన్నారు. అనంతరం గ్రామస్తులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో పీహెచ్ ఎన్ సౌందర్య, హెచ్ ఎస్ రోజా, సర్పంచ్ ఉమ్మెత్తల శోభ రవీందర్ రెడ్డి, ఉపసర్పంచ్ తిప్పారపు రాజయ్య, గ్రామపంచాయతీ కార్యదర్శి ప్రత్యూష, ఏఎన్ఎంలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.