Sultanabad | సుల్తానాబాద్ రూరల్, ఏప్రిల్0 7: వ్యాధుల పట్ల అవగాహన కలిగి ఉన్నప్పుడే వ్యాధులు దరిచేరవని గర్రెపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి వైద్యాధికారి ఉదయ్ కుమార్ అన్నారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా గర్రెపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో వైద్య సిబ్బందితో పాటు గ్రామస్తులతో కలిసి గ్రామ వీధుల గుండా ర్యాలీ సోమవారం నిర్వహించారు.
ఆరోగ్య సూత్రాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వైద్యాధికారి డాక్టర్ ఉదయ్ కుమార్ మాట్లాడుతూ లింగ నిర్దారణ, ఆడ పిల్లల సంరక్షణ, మాతా-శిశు సంరక్షణ, అసంక్రమిత వ్యాధులపై వివరించారు. సీజనల్ వ్యాధులు, మలేరియా, డెంగ్యూ పైలేరియా, లెప్రసీ కుటుంబ నియంత్రణ మొదలగు వ్యాధులు పైన అవగాహనా కల్పించారు. ఈ కార్యక్రమంలో సూపర్ వైజర్ వైజర్, ఆశ వర్కర్లు సిబ్బంది, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.