Kolanuru | ఓదెల, ఫిబ్రవరి 9 : పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కొలనూరు గ్రామానికి చెందిన ఫొటోగ్రాఫర్ కు ఇండియన్ వెడ్డింగ్ ఫెస్టివల్ ఫొటోగ్రఫీలో అవార్డు దక్కింది. ఇండియన్ వెడ్డింగ్ ఫోటోగ్రఫీ ఫెస్టివల్ 2026 సిగ్మా అకాడమీ ఆఫ్ ఫొటోగ్రఫీ ఆధ్వర్యంలో సాప్ ఇండియన్ వెడ్డింగ్ ఫొటోగ్రఫీ కాంటెస్ట్ అవార్డ్స్, ఎగ్జిబిషన్ హైదరాబాద్లో నిర్వహించారు. ఈనెల 7, 8, 9 తేదీలలో ఈ ఉత్సవాలు నిర్వహించారు.
ఇందులో కొలనూరు గ్రామానికి చెందిన ఫొటోగ్రాఫర్ ఉప్పు ముత్యం కు అవార్డు లభించింది. సిగ్మా అకాడమీ పరిహార్ ఇండియా లెవెల్ లో నిర్వహించిన వెడ్డింగ్ ఫోటోగ్రఫీ హైదరాబాదులోని కేబీఎన్ ఫంక్షన్ హాల్ ఎల్బీనగర్ నిర్వహించారు. ఇందులో 91 మంది ఫోటోగ్రాఫర్లు పాల్గొన్నారు. కాగా 728 చిత్రాలను పంపించారు. కొలనూరుకు చెందిన ముత్యం కు మెరిట్ అవార్డు రావడం జరిగింది. వివాహ వేడుక సందర్భంలో అబ్బురపలిచే దృశ్యాల తీపి గుర్తులు కళ్ల ఎదుట కదిలాడేలా చేయగలిగేది ఫొటోనే అన్నారు. కొలనూరు వాసికి అవార్డు రావడం పట్ల గ్రామస్తులు అభినందించారు.