Accident | వీణవంక, ఏప్రిల్ 21: ఆటో, బైక్ ఢీకొన్న ఘటనలో ఆటో డ్రైవర్ మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన సోమవారం ఉదయం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం… మండలంలోని ఐలాబాద్, చల్లూరు గ్రామాల మధ్య జమ్మికుంట నుండి పేపర్ వేసి వెళ్తున్న ఆటో, కరీంనగర్ నుండి జమ్మికుంట కు బైక్ పై వెళ్తున్న మర్రి రమేష్ ఎదురెదురుగా ఢీకొన్నారు.
ఈ ఘటనలో ఆటో డ్రైవర్ నాగరాజు అక్కడికక్కడే మృతి చెందగా, మర్రి రమేష్ కు తీవ్రగాయాలు అయ్యాయి. 108 వాహనం లో కరీంనగర్ సివిల్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. మృతుడు నాగరాజు కు భార్య, పిల్లలు ఉన్నారు.