కోల్‌సిటీ, మార్చి 26: రామగుండం నగరపాలక సంస్థ 93.87 చదరపు కిలోమీటర్ల విస్తీరణంలో ఉన్నది. కార్పొరేషన్‌కు అనుకుని రామగిరి మండలం వెంకట్రావుపల్లి, పాలకుర్తి మండలం ఎల్కలపల్లి గేట్, అంతర్గాం మండలం కుందనపల్లి జీపీ అక్బర్‌నగర్, లింగాపూర్ గ్రామాలు ఉన్నాయి. గతంలోనే బీఆర్ఎస్ హయాంలో కుందనపల్లి గ్రామాన్ని కార్పొరేషన్లో విలీనం చేశారు. గ్రామస్తుల విన్నపం మేరకు అప్పటి ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ప్రత్యేక చొరవ తీసుకొని తెలంగాణ తొలి సీఎం కేసీఆర్‌కు సమస్యను విన్నవించగా, కుందనపల్లిని కార్పొరేషన్లో విలీనం చేసే ప్రక్రియను విరమించుకున్నారు. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాల్లోనూ గతంలో ప్రతిపాదించినా గ్రామాలనే కార్పొరేషన్లో విలీనం చేస్తూ ఆమోదించారు. తమ ఆమోదం లేకుండానే ఎలా విలీనం చేస్తారంటూ ఆయా గ్రామాల ప్రజల ప్రశ్నిస్తున్నారు. అధిక శాతం మంది ప్రజలు గ్రామ పంచాయతీలో ఉండడానికే ప్రాధాన్యమిస్తున్నారు. కార్పొరేషన్లో విలీనమైతే ఉపాధిహామీ పథకాన్ని కోల్పోతామని వారు చెబుతున్నారు. ప్రస్తుతం ఆయా గ్రామాల్లో విలీన ప్రక్రియ చర్చనీయాంశంగా మారింది. అయితే గ్రామస్తుల నుంచి విముఖత వచ్చినా.. విలీనం చేస్తారా? అనే సందేహాలు నివృత్తి కావాల్సి ఉన్నది. ఎల్కలపల్లిగేట్, వెంకట్రావుపల్లి గ్రామాల ప్రజలు విలీనానికి వ్యతిరేకంగా ఆందోళనకు సిద్ధం అవుతున్నట్లు తెలిసింది.
ప్రభుత్వానిది అనాలోచిత నిర్ణయం. మా గ్రామస్తుల పక్షాన నిలబడుతా. రాజకీయ స్వార్థం కోసం మా గ్రామాన్ని బలిచేయొద్దు. మా సాదకబాధలు గుర్తించి గతంలో బీఆర్ఎస్ ప్రభు త్వం విలీన ప్రక్రియను విరమించుకున్నది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా విలీనం చేయాలని చూస్తున్నది. ముమ్మాటికి తాము గ్రామ పంచాయతీలోనే ఉంటాం. మంత్రి శ్రీధర్‌బాబు పునరాలోచించి విలీనం జాబితా నుంచి మా వెంకట్రావుపల్లి గ్రామాన్ని తొలగించాలి. లేదంటే పార్టీకి రాజీనామా కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నా.
మా గ్రామస్తుల అభిప్రాయానికి విరుద్ధంగా కార్పొరేషన్లో విలీనం చేస్తే ఊరుకోం. ముమ్మాటికి గ్రామ పంచాయతీలోనే ఉంటాం. కలెక్టర్‌ను కలిసి తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తాం. విలీనం ఆలోచన విరమించుకోవాలి. ఈ విషయమై స్థానిక ఎమ్మెల్యేను కూడా కలిసి విన్నవిస్తాం. గ్రామస్తుల అభిప్రాయాలు పరిగణలోకి తీసుకోకుండా ఎలా విలీనం చేస్తరు? గతంలోనే విలీనం చేస్తామంటే ఒప్పుకోలేదు. మళ్లీ ఇప్పుడు అదే ప్రయత్నం చేస్తున్నరు. కార్పొరేషన్లో ఎల్కలపల్లి గేట్ గ్రామాన్ని విలీనం చేయొద్దు.