Ashada Bonalu | మారుతి నగర్ జూలై 23: మెట్పల్లి పట్టణంలో గ్రామ దేవతలకు భక్తులు, మహిళలు బుధవారం ఆషాఢ బోనాలను సమర్పించారు. ఆషాఢ మాసం ఆఖరి రోజు కావడంతో భక్తులు మహాలక్ష్మి అమ్మవారితో పాటు ఆయా వార్డులోని పోచమ్మలకు మహిళలు భక్తిశ్రద్ధలతో నైవేధ్యాన్నివండి, డప్పు, చప్పుళ్లతో ఆలయాలకు చేరుకొని తమ కుటుంబాలను చల్లగా చూడు తల్లి అంటూ ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ముక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా పలువురు ప్రజాప్రతినిధులు గ్రామ దేవతలను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేపట్టారు. ఆయా కుల సంఘాల ఆధ్వర్యంలో వనభోజన కార్యక్రమంలో పాల్గొన్నారు.