చిగురుమామిడి, డిసెంబర్ 23 : ఆశాల పెండింగ్ బిల్లులు వెంటనే మంజూరు చేయాలని ప్రభుత్వ తీరును నిరసిస్తూ కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండల ఆరోగ్య కేంద్రం వద్ద ఆశాలు మంగళవారం ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ కసంద్భంగా వారు మాట్లాడుతూ..పెండింగ్లో ఉన్న లెప్రసీ, ఎలక్షన్ డ్యూటీ బిల్లులు, పల్స్ పోలియో బిల్లులు వెంటనే చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెట్టిచాకిరీ చేయించుకుంటుందని, 20 సంవత్సరాలుగా పనులను బట్టి పారితోషకం ఇవ్వకుండా పనులు చేయించుకుంటున్నారని ఆదేవన వ్యక్తం చేశారు.
గర్భవతి నమోదు, బాలిక సంరక్షణ, జీరో టు ఐదు సంవత్సరాల పిల్లలకు టీకాలు, మొదలగు వాటికి మాత్రమే పారితోషకాలు ఇస్తున్నారని, ఇతర పనులకు డబ్బులు ఇవ్వడం లేదన్నారు. ప్రభుత్వం ఆశలకు కనీస వేతనం పెంచాలని కోరారు. ఏరియల్ తోపాటు పింఛన్ సదుపాయం కల్పించాలని ప్రమాద బీమా, క్యాజువల్యూస్, పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం ఆరోగ్య కేంద్రం వద్ద మండల ఇంచార్జ్ వైద్యాధికారి సందీప్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆశ వర్కర్ల మండల కార్యదర్శి బోయిని ప్రియాంక, ఆశాలు బండారి సరోజన, అంజలి, సరోజన, సునీత, లక్ష్మి, కవిత, కమల, శ్వేత, సునీత, పుష్ప తదితరులు పాల్గొన్నారు.