Peddapally | పెద్దపెల్లి టౌన్, ఏప్రిల్ 3: పెద్దపల్లి పట్టణంలోని మారుతి నగర్ లో నివాసముండే వరంగల్ జిల్లాకు చెందిన ఆర్టిజన్ కార్మికుడు రాజకుమార్ ఇంట్లో ఎవరు లేని సమయంలో ఫ్యాన్ కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై లక్ష్మణరావు తెలిపారు.
పోలీసుల కథనం ప్రకారం.. గురువారం ఉదయం భార్య స్వాతి బంధువుల ఇంటికి వెళ్లగా ఇంట్లో ఎవరు లేని సమయంలో మద్యానికి బానిసైన రాజకుమార్ ఫ్యాన్ కి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు వెల్లడించారు. తల్లి సాంబలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మృతుడు రాజ్ కుమార్ వరంగల్ జిల్లాకు చెందిన వ్యక్తి పెద్దపల్లిలోని కమ్మర్పల్లిలో సబ్ స్టేషన్ లో ఆర్టిజన్ కార్మికుడిగా విధులు నిర్వహిస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.