Karimnagar | ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో ఇష్టారాజ్యం..? కరీంనగర్ కలెక్టర్ ఛాంబర్ ఎదుట బాధిత దంపతుల బైఠాయింపు
పేదల సొంతింటి కలను నిజం చేయాల్సిన ఇందిరమ్మ ఇళ్ల పథకం క్షేత్రస్థాయిలో వివాదాలకు కేంద్రంగా మారుతోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అర్హులైన నిరుపేదలకు ఇళ్లు మంజూరు కాకపోగా, ఆర్థిక స్థోమత, భూములు ఉన్నవారికి ఇళ్లను కేటాయిస్తున్నారనే విమర్శలు ప్రభుత్వ పథకం అమలులో పారదర్శకతను ప్రశ్నార్థకం చేస్తున్నాయి.
- అర్హులకు అన్యాయం.. అనర్హులకు అందలం!
- గ్రామ కమిటీ ఆగడాలపై ఆగ్రహం
Karimnagar | కరీంనగర్ కలెక్టరేట్, నవంబర్ 3 : పేదల సొంతింటి కలను నిజం చేయాల్సిన ఇందిరమ్మ ఇళ్ల పథకం క్షేత్రస్థాయిలో వివాదాలకు కేంద్రంగా మారుతోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అర్హులైన నిరుపేదలకు ఇళ్లు మంజూరు కాకపోగా, ఆర్థిక స్థోమత, భూములు ఉన్నవారికి ఇళ్లను కేటాయిస్తున్నారనే విమర్శలు ప్రభుత్వ పథకం అమలులో పారదర్శకతను ప్రశ్నార్థకం చేస్తున్నాయి. గ్రామస్థాయి ఇందిరమ్మ కమిటీల నిర్ణయాలు పేదల పాలిట శాపంగా మారుతున్నాయంటూ బాధితులు ఆందోళనబాట పడుతుండగా, పేదల కోసం ప్రవేశపెట్టిన పథకంలో పేదలకే చోటు లేదా? అన్న ప్రశ్న ఇప్పుడు బాధితుల నుంచి వినిపిస్తోంది.
ఇళ్ల కేటాయింపు తీరు గ్రామ కమిటీల సిఫార్సులు, పలుకుబడి, పైరవీలే ప్రామాణికంగా తీసుకుంటున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పథకం పేరుతో పేదలకు ఆశలు కల్పించి, చివరకు జాబితాల్లో మొండిచేయి చూపడమే ప్రభుత్వ పాలనలో పారదర్శకతకు నిదర్శనమా..? అని బాధితులు నిలదీస్తున్నరు. అయినా స్పందన లేకపోవటంతో, జిల్లా ఉన్నతాధికారి వద్దకే వచ్చి నిరసనలు చేపడుతున్నారు. ఇదే క్రమంలో సైదాపూర్ మండలం ఎలబోతారం గ్రామానికి చెందిన రావుల మమత, ఆమె భర్త అశోక్ ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో తమకు జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ మంగళవారం కలెక్టర్ ఛాంబర్ ఎదుట బైఠాయించారు. గ్రామ కమిటీల ఏకపక్ష ధోరణి, అవినీతి, అక్రమాలు, ఇళ్ల కేటాయింపులో జరుగుతున్న అన్యాయంపై నినాదాలు చేస్తూ తమ ఆవేదనను వ్యక్తం చేశారు.
తాము అత్యంత నిరుపేద కుటుంబానికి చెందినవారమని, ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద దరఖాస్తు చేసుకున్నామని మమత తెలిపారు. మొదటి విడతలో ఇల్లు మంజూరైందని అధికారులు చెప్పగా, తమ పాత ఇంటిని సైతం తొలగించుకున్నామని, తీరా లబ్ధిదారుల జాబితాలో పేరు లేకుండా పోయిందని వాపోయారు. అప్పటి నుంచి నివాసం లేకుండా నిరాశ్రయులుగా కాలం వెళ్లదీస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా విడుదలైన రెండో విడత జాబితాలోనూ తమకు చోటు దక్కకపోవడంతో దిక్కుతోచని పరిస్థితి ఏర్పడిందన్నారు. మరోవైపు గ్రామంలో ఆర్థిక స్థోమత, భూములు ఉన్నవారికి ఇళ్లు కేటాయించారని, నిజమైన నిరుపేదలను మాత్రం పక్కన పెట్టారని ఆమె ఆరోపించారు.
గ్రామ ఇందిరమ్మ కమిటీ సభ్యులను ఈ విషయమై ప్రశ్నించగా ‘మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి’ అంటూ అవమానకరంగా మాట్లాడారని ఆవేదన వ్యక్తం చేశారు. తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న తనకు వైద్య ఖర్చులు భరించే స్తోమత కూడా లేదని, తలదాచుకునేందుకు గూడు లేక కుటుంబం తీవ్ర మానసిక, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోందని కన్నీటిపర్యంతమయ్యారు. గ్రామ ఇందిరమ్మ కమిటీని రద్దు చేసి ప్రత్యేక అధికారులతో సమగ్ర విచారణ జరిపించాలని, గ్రామంలో మంజూరైన ఇళ్ల జాబితాను పునఃపరిశీలించి అనర్హుల ఎంపికపై చర్యలు తీసుకోవాలని మమత దంపతులు వీరి సమస్య తెలుసుకునేందుకు వచ్చిన కలెక్టరేట్ కార్య నిర్వహణాధికారిని వేసుకున్నారు. కాగా, బాధితుల దరఖాస్తు పరిశీలించిన ఏవో సుధాకర్ ఇల్లు మంజూరీకి అవసరమైన చర్యలు చేపట్టాలని సంబంధిత మండల అధికారులకు సూచించారు. ఇప్పటికైనా యంత్రాంగం స్పందించి ఇల్లు మంజూరు చేస్తుందా? లేక పేదల గోడు అధికారుల కార్యాలయాల గోడలకే పరిమితమవుతుందా? అన్నది వేచి చూడాల్సిందే.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CBFC | సెన్సార్ బోర్డు కొత్త రూల్స్ పిరికిపంద చర్య.. బాలీవుడ్ దర్శకుడు తీవ్ర ఆగ్రహం!
‘విద్యుత్ పొదుపు ప్రతి ఒక్కరి బాధ్యత’
Suriya | హ్యాట్రిక్ కొట్టేందుకు సిద్ధమైన సూర్య.. ‘సీన్’పై భారీ అంచనాలు!
KTR | తల్లిని, బిడ్డని ఒక్కటి చేసి..ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కేటీఆర్
Jobs | అటామిక్ ఎనర్జీలో 254 టీచర్ పోస్టులు.. నవంబర్ 22 చివరితేదీ
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

