Intermediate admissions | కాల్వ శ్రీరాంపూర్ మే 3: మల్యాల మోడల్ స్కూల్ అండ్ జూనియర్ కాలేజీ లో ఇంటర్ మొదటి సంవత్సర ప్రవేశాల కోసం ఈనెల 5 నుండి 20వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ప్రిన్సిపాల్ అనుముల పోచయ్య తెలిపారు. ఈ మేరకు ఆయన శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. పదో తరగతి పాసైన విద్యార్థులు ఆన్లైన్లో ఉచితంగా అప్లై చేసుకోవచ్చని తెలిపారు.
ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, ఎంఈసీ గ్రూపులలో ప్రతీ గ్రూపులో 40 సీట్ల కు ఉంటాయని, ఆన్లైన్లో అప్లై చేసుకుని అడ్మిషన్ తీసుకోవాలని సూచించారు. విద్యార్థినిలకు ఉచిత హాస్టల్ సౌకర్యం కలదని, ఈ అవకాశాన్ని మండల విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.