Admissions | వేములవాడ, జూన్ 5: వేములవాడ పట్టణంలోని సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో మొదటి సంవత్సరం ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఇన్ చార్జి ప్రిన్సిపాల్ డాక్టర్ కే లావణ్య తెలిపారు. 2025- 26 విద్యా సంవత్సరానికి గాను కళాశాలలో బిఎ (హెచ్ఈపి), బీకాం (సిఎ), బీఎస్సీ (బీజెడ్ సి, ఎం జెడ్ సి, ఎం పి సి, ఎంపీ సి ఎస్ , ఎమ్మెస్సీ ఏస్), బీఎస్సీ హానర్స్ (డిజైన్ అండ్ టెక్నాలజీ) మొదటి సంవత్సరం మీడియం డిగ్రీ కోర్సులలో ప్రవేశాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఆమె తెలిపారు.
ఇంటర్ ఉత్తీర్ణత సాధించిన మహిళా అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవాలని వెల్లడిస్తూ గ్రామీణ ప్రాంతాల వారు వారి తల్లిదండ్రులకు కనీసం వార్షిక ఆదాయం 1,50,000, పట్టణ ప్రాంత నివాసకులైతే 2 లక్షల రూపాయల ఆదాయం మించి ఉండకూడదని తెలిపారు. దరఖాస్తు తో పాటు ఎస్ఎస్ సి మెమో, ఇంటర్ మార్కుల మెమో, ఆదాయ ధ్రువీకరణ పత్రం, కుల ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డు, జిరాక్స్ పత్రాలతో పాటు ఐదు ఫోటోలతో కూడిన దరఖాస్తులు కళాశాలలో అందజేయాలన్నారు.