Peddapally | పెద్దపల్లి రూరల్, నవంబర్ 27 : ఖో-ఖో అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లాస్థాయిలో నిర్వహించిన పోటీల్లో పెద్దపల్లి మండలం అప్పన్నపేటకు చెందిన ఎనిమిదో తరగతి విద్యార్థిని పంబాల అశ్విత ఎంపికైంది. ఈ మేరకు రాష్ట్ర స్థాయి జూనియర్స్ ఖో-ఖో సెలక్షన్స్ కి ఎంపికైన అప్పన్నపేట జడ్పీహెచ్ఎస్ లో ఎనిమిదో తరగతి చదువుతున్న పంబాల అశ్విత ఈనెల 28 నుంచి 30 వరకు సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువులో జరిగే రాష్ట్ర స్థాయి జూనియర్స్ ఖో-ఖో ఛాంపియన్ పోటీలకు ఎంపిక కావడం హర్శించదగ్గ విషయమని పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ వేల్పుల సురేందర్ అన్నారు.
ఈ మేరకు పాఠశాల గురువారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం ఎస్ పురుషోత్తం మెమొంటో ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే పాఠశాల ఉపాధ్యాయులు అశోక్, శ్రీదేవి, రాజేశ్వర్, కనకయ్య, శ్రీనివాస్, సారయ్య, భాస్కర్, సుమిత్, సీఆర్పీ తిరుపతి, వాసంతి, జ్యోతి మంజుల, సోని, పద్మ, అనూషతో పాటు తల్లిదండ్రులు, విద్యార్థులు అభినందనలు తెలియజేశారు.