Karimnagar | కమాన్ చౌరస్తా, నవంబర్ 10 : కరీంనగర్ కృష్ణ నగర్ లోని అభయ ఆంజనేయ స్వామి దేవాలయంలో ఈ రోజు నుంచి డిసెంబర్ 20 వరకు ప్రతీరోజు అయ్యప్ప స్వాములకు అన్నదానం నిర్వహిస్తున్నామని దేవాలయం ప్రధాన అర్చకులు తాటిచెర్ల హరికిషన్ శర్మ అన్నారు. ఈ సందర్భంగా తాటిచెర్ల హరికిషన్ శర్మ మాట్లాడుతూ గత ఎనిమిది సంవత్సరాల నుంచి దాతల సహాయ సహకారాలతో నిత్యం 500 నుండి 800 మంది అయ్యప్ప స్వాములు అన్నదానం నిర్వహిస్తున్నామని చెప్పారు.
అదే విధంగా వివిధ ప్రాంతాల నుండి పనులపై కరీంనగర్ కు వచ్చిన అయ్యప్ప స్వాములకు అన్నదానం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. నగరంలోని అయ్యప్ప స్వాములు నగరానికి వచ్చే భక్తులు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. అలాగే, భక్తులు వస్తు రూపేణా, ధన రూపేనా ఏదైనా దేవాలయంలో ఇచ్చి తమ పేరును నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సామ విజయ్ గురుస్వామి, నందకుమార్ గురుస్వామి తదితరులు పాల్గొన్నారు.