work pressure | పెద్దపల్లి రూరల్, సెప్టెంబర్ 1 : ఎన్సీడీ ప్రోగ్రాం వల్ల తమపై అదనపు భారం పడుతుందని, అయినప్పటికీ గతంలో ఉన్నతాధికారుల సూచనలమేరకు చేశామని, కానీ ఇప్పుడు తమపై భారం పెరిగి అనేక ఇబ్బందులకు గురౌతున్నామని ఆ పని భారం నుంచి తప్పించాలని ఏఎన్ఎంలు పెద్దపల్లి మండలంలోని రాగినేడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ శ్రావణ్ కు విజ్ఞప్తి చేశారు.
పలు డిమాండ్లు, సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని సోమవారం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్సీడీ ప్రోగ్రాం ఆన్ లైన్ చేసే పని మాకు సంబంధించినది కాదని అయినా ఇబ్బందులు పడుకుంటు చేశామని, ఇప్పుడు తమకు పని ఒత్తిడి వల్ల ఆరోగ్య సమస్యలు వస్తున్న నేపథ్యంలో ఆ భారం నుంచి తప్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాగినేడు పీహెచ్సీ పరిధిలోని పలువురు ఏఎన్ఎం-1లు, ఏఎన్ఎం-2లు పాల్గొన్నారు.