Chigurumamidi | త్వరలో అంగన్వాడీ టీచర్ల భర్తీ.. కరీంనగర్ జిల్లా శిశు సంక్షేమ అధికారిని సరస్వతి
కరీంనగర్ జిల్లావ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాలలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ టీచర్ల భర్తీని ప్రభుత్వ ఆదేశాల మేరకు త్వరలోనే భర్తీ చేయునున్నట్లు జిల్లా శిశు సంక్షేమ అధికారిణి మార్త సరస్వతి అన్నారు.
Chigurumamidi | చిగురుమామిడి, మే 16 : కరీంనగర్ జిల్లావ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాలలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ టీచర్ల భర్తీని ప్రభుత్వ ఆదేశాల మేరకు త్వరలోనే భర్తీ చేయునున్నట్లు జిల్లా శిశు సంక్షేమ అధికారిణి మార్త సరస్వతి అన్నారు. చిగురుమామిడి మండలంలోని లంబాడిపల్లె గ్రామంలో అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ జిల్లాలో 61 అంగన్వాడీ టీచర్లు 232 ఆయా పోస్టులు భర్తీ చేయనున్నట్లు తెలిపారు. రిజర్వేషన్లు ఆధారంగా ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయున్నామని చెప్పారు. ముందుగా 61 అంగన్వాడీ టీచర్ల భర్తీ అనంతరం ఆయాల పోస్టులను పూర్తి చేస్తామని వెల్లడించారు. జిల్లావ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాల్లో గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం అందిస్తున్నట్లు పేర్కొన్నారు.
లంబాడిపల్లి లో నిరుపయోగ ఉంటున్న నిరుపయోగంగా ఉంటున్న అంగన్వాడీ కేంద్రంలో రాబోయే విద్యా సంవత్సరానికి ఇన్చార్జి అంగన్వాడి టీచర్లతో అంగన్వాడీ కేంద్రాన్ని నడిపిస్తున్నామని, ఇందుకు గ్రామస్తులు పూర్తిస్థాయిలో సహకారం అందించాలని సూచించారు. అనంతరం గ్రామపంచాయతీ వద్ద గ్రామస్తులతో మాట్లాడారు. గ్రామం నుండి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని సర్పంచ్ కాటం సంపత్ రెడ్డి పేర్కొన్నారు. వీరి వెంట సీడీపీవో శ్రీలత, సూపర్వైజర్ ఇస్రాత్ సుల్తానా, ఉప సర్పంచ్ నక్క ఓదేలు, పంచాయతీ కార్యదర్శి పద్మావతి, అంగన్వాడీ టీచర్లు వరలక్ష్మి, అనురాధ, ధనలక్ష్మి, వార్డు సభ్యులు ఉన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Women | మహిళలు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన వైద్య పరీక్షలు ఇవే.. నిపుణుల సూచన..
Rashmi | ఐదేళ్ల చిన్నారి హత్యపై యాంకర్ రష్మి ఆవేదన.. మనం ఎటు వెళ్తున్నాం అంటూ భావోద్వేగ పోస్ట్!
Marnus Labuschagne | 49 ఏళ్లలో ఒకేఒక్కడు.. భారత దిగ్గజం సరసన లబూషేన్..!
Singireddy Niranjan Reddy | నార్లపూర్ పంపు ఆన్ చేయకపోతే కార్యాచరణకు సిద్ధం : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
Stock Markets | భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. 22,400 దిగువకు నిఫ్టీ..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

