తిమ్మాపూర్ రూరల్, డిసెంబర్14: చేతికచ్చిన కొడుకు బైక్‌లో పెట్రోల్ పోయించుకొని వస్తూ లారీ ఢీకొని మృతిచెందిన ఘటన తిమ్మాపూర్ మండల కేంద్రంలో జరిగింది. ఎల్ఎండీ ఎస్ఐ శీలం ప్రమోద్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. తిమ్మాపూర్ మండల కేంద్రానికి చెందిన మాతంగి ఆంజనేయులు(22) మోటార్ వైండింగ్ పనులు చేస్తూ కుటుంబానికి ఆసరాగా ఉంటున్నాడు. ఈ క్రమంలో బుధవారం సాయంత్రం తిమ్మాపూర్ స్టేజీ సమీపంలోని బంకులో పెట్రోల్ పోయించు కుని తిరిగి రోడ్డు ఎక్కుతున్నాడు. ఇదే సమయం లో కరీంనగర్ వైపు వెళ్తున్న లారీ అజాగ్రత్తగా వ చ్చి, బైక్‌ను ఢీ కొట్టడంతో ఆంజనేయులుకు తీవ్ర గాయాలై, అక్కడిక్కడే మృతిచెందాడు.
విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు బోరున విలపిం చారు. ఆంజనేయులుకు ఇద్దరు అన్నలు కాగా, రెండో అన్న రాజేందర్ రెండేళ్ల క్రితమే అ నారో గ్యంతో మృతిచెందాడు. ఇద్దరు కొడుకులు మర ణించడంతో తల్లిదండ్రులు, కుటుంబసభ్యుల రో దనలు మిన్నంటాయి. ఎస్ఐ ప్రమోద్‌రెడ్డి, పో లీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేసి, పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని ప్రభుత్వ దవాఖానకు తరలించారు. ఆంజనేయులు అన్న ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.