Karimnagar | సొంతింటిలోనే పరాయిదైన వృద్ధురాలు..! ప్రజావాణిలో పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోని అధికారులు
‘భర్త మరణించాడు.. సంతానం లేదు.. వృద్ధాప్యంలో ఒంటరిగా జీవిస్తున్న ఓ మహిళకు సొంత ఇంటిలోనే భద్రత కరువైంది. ఆశ్రయం కల్పించిన బంధువే తన ఇంటిని అక్రమంగా ఇతరుల పేరుపై రిజిస్ట్రేషన్ చేయించాడు.’ అని గంగాధర మండలం ఉప్పరమల్యాలకు చెందిన వేల్పుల రాధమ్మ ఆరోపిస్తోంది.
- న్యాయం కోసం కరీంనగర్ కలెక్టరేట్ చుట్టూ ప్రదక్షిణలు.. నిలువ నీడ కోల్పోయే దుస్థితి
Karimnagar | కరీంనగర్ కలెక్టరేట్, నవంబర్ 16 : ‘భర్త మరణించాడు.. సంతానం లేదు.. వృద్ధాప్యంలో ఒంటరిగా జీవిస్తున్న ఓ మహిళకు సొంత ఇంటిలోనే భద్రత కరువైంది. ఆశ్రయం కల్పించిన బంధువే తన ఇంటిని అక్రమంగా ఇతరుల పేరుపై రిజిస్ట్రేషన్ చేయించాడు.’ అని గంగాధర మండలం ఉప్పరమల్యాలకు చెందిన వేల్పుల రాధమ్మ ఆరోపిస్తోంది. తనకు తెలియకుండా మాయమాటలు చెప్పి వేలిముద్రలు తీసుకుని, ఇంటి హక్కులను బంధువు భార్య శోభ పేరుపై బదలాయించారని, ఆస్తిపై రుణం కూడా తీసుకున్నారని వాపోయింది. అంతేకాకుండా ఇంటి నుంచి వెళ్లిపోవాలని వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ అన్యాయంపై పలుమార్లు ప్రజావాణిలో ఫిర్యాదు చేసినా అధికారుల నుంచి ఆశించిన స్పందన కరువైందని రాధమ్మ కన్నీటిపర్యంతమవుతోంది.
పోలీసు, రెవెన్యూ, వయోవృద్ధుల సంక్షేమ శాఖ అధికారుల చుట్టూ తిరిగినా సమస్య పరిష్కారం కాలేదని పేర్కొంది. ప్రతిసారి ఫిర్యాదు చేయడమే తప్ప తనకు న్యాయం మాత్రం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తోంది. వృద్ధురాలినని, ఒంటరిగా ఉన్నానని తన సమస్యను అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారా? అని ప్రశ్నిస్తోంది. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి ఇంటి రిజిస్ట్రేషన్ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి, తన ఆస్తిని కాపాడటంతో పాటు ప్రాణ, ఆస్తి రక్షణ కల్పించాలని వేడుకుంటోంది.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
తుంగతుర్తి నియోజకవర్గంలో లబ్ధిదారులకు నూతన పెన్షన్ మంజూరు పత్రాలు అందజేత
బీఆర్ఎస్ నాంపల్లి సర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా నక్క చంద్రశేఖర్
‘ప్రజాస్వామ్యంలో పత్రికల పాత్ర ఎంతో గొప్పది’
Suicide attempt | సాగునీటిని అడ్డుకున్న మంత్రి వివేక్ అనుచరులు.. రైతు ఆత్మహత్యాయత్నం
భద్రాద్రి జిల్లాలో పిల్లల ప్రజావాణి
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

