భద్రాద్రి జిల్లాలో పిల్లల ప్రజావాణి
నేను నా హక్కులు.. నా భవిష్యత్ వాటి కోసం చైల్డ్ ప్రొటెక్షన్ ఆధ్వర్యంలో భద్రాద్రి జిల్లా కలెక్టరేట్లో సోమవారం పిల్లల కోసం ప్రత్యేక ప్రజావాణి నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా పిల్లల నుండి 73 ఫిర్యాదులు రాగా వాటిని అదనపు కలెక్టర్ వేణుగోపాల్‌కు...
భద్రాద్రి కొత్తగూడెం. నవంబర్ 16 : నేను నా హక్కులు.. నా భవిష్యత్ వాటి కోసం చైల్డ్ ప్రొటెక్షన్ ఆధ్వర్యంలో భద్రాద్రి జిల్లా కలెక్టరేట్లో సోమవారం పిల్లల కోసం ప్రత్యేక ప్రజావాణి నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా పిల్లల నుండి 73 ఫిర్యాదులు రాగా వాటిని అదనపు కలెక్టర్ వేణుగోపాల్‌కు అందజేశారు. తల్లిదండ్రులు లేని పిల్లలు వివిధ పాఠశాలల్లో చదువుతూ వారి ఆర్థిక పరిస్థితి బాగోలేకపోవడంతో స్కాలర్షిప్ రావడం లేదని, మరికొంతమంది విద్యార్థులు తమ అమ్మనాన్నలు వేరే రాష్ట్రాల నుండి కొత్తకోటకు వలస వచ్చారు తమకు ఆధార్ కార్డులు లేవు, తమకు పథకాలు ఎలా వస్తాయంటూ వినతులు సమర్పించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వేణుగోపాల్, జిల్లా సంక్షేమ అధికారి మంగతార, ఐ సి పి ఎస్ అధికారి హరికుమారి, చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీ సభ్యులు సాదిక్ పాషా, సుమిత్ర దేవి అంబేద్కర్, పోషణ్ అధికారి సంపత్, రూప, కళ్యాణి, శేషయ్య, అజిత్, నాగరాజు, వినోద్ బాబు, భారతి, లత, రాజు, సందీప్ కుమార్ పాల్గొన్నారు.

భద్రాద్రి జిల్లాలో పిల్లల ప్రజావాణి
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
భద్రాద్రి జిల్లాలో పిల్లల ప్రజావాణి
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Illegal assets | ఆదాయానికి మించి అక్రమ ఆస్తులు.. టీపీవోపై కేసు నమోదు
Harish Rao | పదేండ్లు తట్టెడు మట్టి ఎత్తకుండా కాంగ్రెస్ సర్కార్ కాలయాపన : హరీశ్ రావు
Health Tips | కోడిగుడ్డు పచ్చసొన తింటే ఒంట్లో చెడు కొవ్వు పెరుగుతుందా.. ?
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

