‘ప్రజాస్వామ్యంలో పత్రికల పాత్ర ఎంతో గొప్పది’
ప్రజాస్వామ్యంలో పత్రికల పాత్ర ఎంతో గొప్పదని, ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకువస్తూ సమాజానికి పాత్రికేయులు అందిస్తున్న సేవలు అభినందనీయమని కొత్తగూడెం ఆర్టీసీ డిపో మేనేజర్ యు.రాజ్యలక్ష్మి అన్నారు. జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా సోమవారం...
– కొత్తగూడెం ఆర్టీసీ డిపో మేనేజర్ యు. రాజ్యలక్ష్మి
– పాత్రికేయులతో కలిసి 1,628వ మొక్క నాటిన వనజీవి విశ్వామిత్ర చౌహాన్
కొత్తగూడెం, నవంబర్ 16 : ప్రజాస్వామ్యంలో పత్రికల పాత్ర ఎంతో గొప్పదని, ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకువస్తూ సమాజానికి పాత్రికేయులు అందిస్తున్న సేవలు అభినందనీయమని కొత్తగూడెం ఆర్టీసీ డిపో మేనేజర్ యు.రాజ్యలక్ష్మి అన్నారు. జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా సోమవారం కొత్తగూడెం బస్టాండ్ ఆవరణలో వనజీవి విశ్వామిత్ర చౌహాన్ ఆధ్వర్యంలో పాత్రికేయులతో కలిసి మొక్క నాటారు. ఈ సందర్భంగా డీఎం రాజ్యలక్ష్మి మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా ప్రతిరోజూ మొక్కలు నాటుతున్న విశ్వామిత్ర చౌహాన్ కృషి అభినందనీయమని, పత్రికా దినోత్సవం సందర్భంగా బస్టాండ్లో మొక్క నాటడం ఆనందంగా ఉందన్నారు.
అనంతరం వనజీవి విశ్వామిత్ర చౌహాన్ మాట్లాడుతూ వాక్ ఫర్ ట్రీస్ యజ్ఞంలో భాగంగా తన 1,628వ మొక్కను నాటినట్లు తెలిపాడు. మొక్కలు నాటుదాం.. పర్యావరణాన్ని కాపాడుదాం అనే నినాదంతో ప్రతి ఒక్కరూ కనీసం ఒక్క మొక్కనైనా నాటి సంరక్షించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయులు కల్లోజీ శ్రీనివాస్, వీరు నాయక్, వట్టికొండ రవి, జోగం తారక రామారావు, బీర రవి, జేబీ బాలు, జబ్బార్, రాందాస్, ఇంగ్లీష్ బాలు, ఆర్టీసీ సిబ్బంది పాల్గొన్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘ప్రజాస్వామ్యంలో పత్రికల పాత్ర ఎంతో గొప్పది’
Suicide attempt | సాగునీటిని అడ్డుకున్న మంత్రి వివేక్ అనుచరులు.. రైతు ఆత్మహత్యాయత్నం
భద్రాద్రి జిల్లాలో పిల్లల ప్రజావాణి
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Illegal assets | ఆదాయానికి మించి అక్రమ ఆస్తులు.. టీపీవోపై కేసు నమోదు
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

