Suicide attempt | సాగునీటిని అడ్డుకున్న మంత్రి వివేక్ అనుచరులు.. రైతు ఆత్మహత్యాయత్నం
Suicide attempt | కాంగ్రెస్ నాయకులు పంట పొలాలకు నీరు అందకుండా అడ్డుకోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం కలకలం సృష్టిస్తోంది .
మంచిర్యాల : కాంగ్రెస్ నాయకుల ( Congress Leaders ) దౌర్జన్యంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ఏకైక జీవనాధారమైన పంట పొలాలకు నీరు అందకుండా అడ్డుకోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన రైతు ఆత్మహత్యాయత్నానికి ( Suicide attempt ) పాల్పడడం కలకలం సృష్టిస్తోంది .
మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం నక్కలపల్లి గ్రామానికి చెందిన సమ్మిరెడ్డి అనే రైతుకు చెరువు నీరు రాకుండామంత్రి వివేక్ వెంకటస్వామి అనుచరులు ( Minister Viveks followers ) అడ్డుకున్నారు. తన పొలం ఎండిపోతుందని పొలానికి సాగునీరు అందించాలని రెవెన్యూ అధికారులకు మొర పెట్టుకు న్నాడు.అక్కడి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం, పంట ఎండిపోతుండడంతో తీవ్ర ఆందోళనకు గురైన సమ్మిరెడ్డి సోమవారం ఇంటి వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
సకాలంలో గమనించిన కుటుంబ సభ్యులు, స్థానికులు రైతును అడ్డుకుని నచ్చజెప్పారు. రైతు కుటుంబానికి న్యాయం చేయాలని, పంట ఎండిపోకుండా నీటిని అందించాలని, నీటిని అడ్డుకున్న కాంగ్రెస్ నాయకులపై చర్యలు తీసుకోవాలని బాధిత రైతు డిమాండ్ చేశారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Suicide attempt | సాగునీటిని అడ్డుకున్న మంత్రి వివేక్ అనుచరులు.. రైతు ఆత్మహత్యాయత్నం
భద్రాద్రి జిల్లాలో పిల్లల ప్రజావాణి
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Illegal assets | ఆదాయానికి మించి అక్రమ ఆస్తులు.. టీపీవోపై కేసు నమోదు
Harish Rao | పదేండ్లు తట్టెడు మట్టి ఎత్తకుండా కాంగ్రెస్ సర్కార్ కాలయాపన : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

