Dharmaram | ధర్మారం, జనవరి 8 : కరెన్సీ నోట్లపై డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఫొటో ముద్రించాలని కరెన్సీ పై అంబేద్కర్ ఫొటో సాధన సమితి జాతీయ అధ్యక్షుడు జేరిపోతుల పరుశురాం కోరారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో కరెన్సీ అంబేద్కర్ ఫొటో జాతీయ ఉపాధ్యక్షుడు బొల్లి స్వామి తో కలిసి మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద విలేకరులతో అనంతరం ఆయన మాట్లాడారు. ఇప్పటికే కరెన్సీ పై అంబేద్కర్ ఫోటో సాధన సమితి జాతీయ కమిటీ ఆధ్వర్యంలో పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న క్రమంలో జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు వడ్డేపల్లి రామచంద్రంను కలిసి కరెన్సీ పై అంబేద్కర్ ఫొటో ముద్రించేందుకు కృషి చేయాలని వినతిపత్రం ఇచ్చినట్లు తెలిపారు.
వెంటనే స్పందిస్తూ ఆర్బీఐ గవర్నర్ కేంద్ర ఆర్థిక శాఖ వ్యవహారాల మంత్రి కి లేఖ రాసినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ విషయం అంబేద్కర్ ఫొటో సాధన సమితి జాతీయ కమిటీకి మెయిల్ ద్వారా, రిజిస్టర్ పోస్టు ద్వారా తనకు సమాచారం వచ్చిందని ఆయన వివరించారు. ఆర్థిక వ్యవహరాల శాఖ పరిశీలన చేసి ఇది న్యాయమైన కోరిక అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని సంపత్ డిమాండ్ చేశారు. దీనిని కేంద్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీల లో ఉన్న మంత్రులు, ఎంపీలు కృషి చేయాల్సిందేనని ఆయన కోరారు. కరెన్సీపై అంబేద్కర్ ఫొటో నిద్రించడంలో కేంద్ర ప్రభుత్వం చేస్తున్న నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ మార్చి 5న ఢిల్లీ పై దండోరా కార్యక్రమం నిర్వహించ నున్నట్లు ఆయన వెల్లడించారు.
ఏప్రిల్ 2026న జరిగే అంబేద్కర్ జయంతోత్సవ కార్యక్రమాల్లో ప్రతీ ఒక్కరూ ఈ అంశాన్ని అమలు చేసే విధంగా ఐక్యతతో కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎర్రగుంటపల్లి సర్పంచ్ దూడ ప్రియాంక తిరుపతి, కొత్తూరు మాజీ సర్పంచ్ మద్దెల నర్సయ్య, నాయకులు సుంచు మల్లేశం,నెరువట్ల మహేందర్, నేరువట్ల రవి,బొల్లి నందయ్య, పుల్ల కొల్ల లింగమూర్తి, ఇరుగురాల రాజనర్సయ్య, బొల్లి రాజం,సంగెం రాజ్ కుమార్, తీగుట్ల ప్రణయ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.