Karimnagar | చిగురుమామిడి, మే 22: మండలంలోని ఇందుర్తి గ్రామంలో 1995- 96 సంవత్సరానికి చెందిన 10వ తరగతికి బ్యాచ్ కు చెందిన బొడ్డు పరశురాములు ఇటీవల గుండెపోటుతో మృతి చెందాడు. కాగా అతనితో చదువుకున్న పదో తరగతి స్నేహితులు మృతుడు పరశురాములు కూతురు పేరున రూ.50వేలు పోస్ట్ ఆఫీస్ లో ఫిక్స్ డిపాజిట్ చేసి డిపాజిట్ పత్రాన్ని గురువారం మృతుడి భార్య, కూతురుకు అందజేశారు.
తమతో పాటు చదువుకుని చిన్న వయసులోనే మృతి చెందడం బాధాకరమని, వారి కూతురు చదువుకునేందుకు ఫిక్స్ డిపాజిట్ చేయడం జరిగిందని మృతుడి స్నేహితుడు ఎస్ కే సిరాజ్ తెలిపారు. వారి కుటుంబాన్ని స్నేహితులందరం అన్ని విధాల ఆదుకుంటామని అన్నారు.