KalvaSrirampur | కాల్వ శ్రీరాంపూర్ మే 4 : కాల్వశ్రీరాంపూర్ మండల కేంద్రంలోని కాకతీయ హైస్కూల్ లో 2009-10 సంవత్సరంలో పదో చదివిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాకతీయ పాఠశాల కరస్పాండెంట్, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ రామీడి తిరుపతిరెడ్డి తో పాటు పూర్వ ఉపాధ్యాయులు పూర్వ విద్యార్థులు హాజరయ్యారు. ముందుగా ఉపాధ్యాయులకు విద్యార్థులు పూలతో ఘన స్వాగతం పలికారు.
అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. పూర్వ విద్యార్థులంతా తమ కుటుంబ సభ్యులతో కలిసి ఒకే వేదిక వద్దకు చేరుకొని తమ చిన్ననాటి పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. ఆటాపాటాలతో పిల్లా పాపలతో సంతోషంగా గడిపారు. పాఠశాలలో ఉపాధ్యాయులతో క్లాస్ రూమ్ లో చేసిన ముచ్చట్లు ఆనాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ ఆనందంగా గడిపారు.
అనంతరం తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులకు జ్ఞాపికలు అందజేసి శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్, ఏఎంసీ చైర్మన్ రామిడి తిరుపతిరెడ్డి, యాజమాన్యం, ఉపాధ్యాయ సిబ్బంది పూర్వ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.