SULTANABAD | సుల్తానాబాద్ రూరల్ మే 11: పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని నర్సాయిపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని విజయ్ గార్డెన్స్ లో సుల్తానాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 1983‑84 పదో తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాన్ని ఆదివారం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అప్పటి గురువులు సాంబయ్య, రామచంద్ర రెడ్డి, రఘు, వెంకటేశంను ఈ కార్యక్రమానికి పిలుచుకొని వారితో ఆపేయాలని అనురాగాలను పంచుకున్నారు.
అనంతరం శాలువాలతో ఘనంగా సత్కరించి, మెమొంటోలు, పుష్పగుచ్చం అందించి సత్కరించారు. వివిధ ప్రాంతాలలో స్థిరపడిన పూర్వ విద్యార్థులు ఒకచోట కలుసుకోవడంతో ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకొని పాత జ్ఞాపకాలను గుర్తుచేర్చుకున్నారు. మహిళలు చేసిన నృత్యాలు పలువురిన అలరించాయి. ఈ కార్యక్రమంలో మాడూరి ప్రసాద్, శ్రీనివాస్,అశోకరావు, రంగారావు, రవీందర్ రెడ్డి ,సురేష్ రెడ్డి , విజయ్ చందర్ ,సంజీవ్, శ్రీకాంత్, లక్ష్మణ్, మల్లేశం, రవి, వెంకటేశం, పద్మ ,ఇందిరా, రేణుక, అంజలి, అనసూర్యతో పాటు తదితరులున్నారు.