Mla Vijaya ramanarao | పెద్దపల్లి రూరల్ ఏప్రిల్ 04: పేదలకు అందాల్సిన పథకాలన్నీ అందుతాయని, కాస్తా ఓపికతో ఉండండి అని పెద్దపల్లి ఎమ్మెల్యే సీహెచ్ విజయరమణారావు అన్నారు. మండలంలోని పాలితం, కాసులపల్లి, అప్పన్నపేట, అందుగులపల్లి, రాఘవాపూర్, గౌరెడ్డిపేట గ్రామాల్లో శుక్రవారం సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
కాసులపల్లి, అప్పన్నపేట గ్రామాల్లో పెన్షన్ లు, ఆత్మీయ భరోసా, రైతు బరోసా పథకాలపై గ్రామస్తులు అడగబోతున్న ప్రశ్నలకు ముందుగానే పసిగట్టిన ఎమ్మెల్యే పైవిధంగా స్పందించారు. వారు అడగక ముందే అనునయించి అందరికీ అన్ని అందుతాయని చెప్పడంతో చేసేదేమి లేక మిన్నకుండిపోయారు.
అప్పన్నపేటలో బీజేపీ నిరసన
పెద్దపల్లి మండలం అప్పన్నపేటలో సన్నబియ్యం పంపిణీ అనంతరం సమావేశం ముగిసి ఎమ్మెల్యే తన వాహనంలో వెళుతుండగా అడ్డుతిరిగి ప్రధాని మోదీ ఫొటోలను ప్రభుత్వపథకాలపై ఎందుకు పెట్టడంలేదని ప్రశ్నించారు. బీజేపీ నాయకులను మా పని మేము చెప్పుకున్నాం మీరు కూడా అలానే సమావేశాలు పెట్టి మీ పథకాలు మీరు చెప్పండి అంటూ వారికి ఎదురు సమాధానం చెప్పారు. ఈ క్రమంలో అక్కడే ఉన్న సీఐ ప్రవీణ్ కుమార్, ఎస్ఐలు లక్ష్మణ్ రావు, స్వామి తమ సిబ్బందితో అక్కడి నుంచి బీజేపీ నాయకులను పంపించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రాజయ్యయాదవ్, పెద్దపల్లి మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ ఈర్ల స్వరూప సురేందర్, వైస్ చైర్మన్ కూర మల్లారెడ్డి, మండల అధ్యక్షుడు ఏడెల్లి శంకరయ్య, ఎనగందుల ప్రదీప్, సందనవేన రాజేందర్ యాదవ్, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.