Gangadhara | గంగాధర, ఏప్రిల్ 20 : జగిత్యాల జిల్లా కేంద్రంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభకు గంగాధర మండలంలోని 33 గ్రామాల నుండి బీఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు వేలాదిగా తరలి వెళ్లారు. ఆయా గ్రామాల్లో గ్రామ శాఖ అధ్యక్షుడు, ముఖ్య నాయకులు బీఆర్ఎస్ పార్టీ జెండాలను ఊపి వాహనాలను ప్రారంభించారు. జగిత్యాలకు వెళ్లే వాహనాల దండుతో రోడ్లన్నీ గులాబీ మయంగా మారాయి. ‘జై తెలంగాణ, జై కేసీఆర్, రేవంత్ రెడ్డి పోవాలి.. కేసీఆర్ రావాలి..’ వంటి నినాదాలతో రహదారులు దద్దరిల్లాయి.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కేసీఆర్ సమక్షంలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్న సందర్భంగా నిర్వహిస్తున్న ప్రజా ఆశీర్వాద సభకు వేలాదిక వెళుతున్నట్లు తెలిపారు. అమలుకు నోచుకోని హామీలను ఇచ్చి, ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ పతనం జగిత్యాల నుండే ప్రారంభం అవుతుందని పేర్కొన్నారు. 2014 నుండి 2023 వరకు ఉన్న హిస్టరీని తిరిగి రిపీట్ చేయడానికి కేసీఆర్ జగిత్యాల గడ్డపై అడుగు పెడుతున్నారన్నారు. కేసీఆర్ బహిరంగ సభతో బీఆర్ఎస్ పార్టీలో నూతన ఉత్సాహం వచ్చిందన్నారు.
ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మేచినేని నవీన్ రావు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సాగి మహిపాల్ రావు, సింగిల్ విండో మాజీ చైర్మన్ దూలం బాలగౌడ్, నాయకులు కంకణాల విజేందర్ రెడ్డి, మడ్లపల్లి గంగాధర్, రామిడి సురేందర్, వేముల దామోదర్, దూలం శంకర్ గౌడ్, ఆకుల మధుసూదన్, చిలుముల సుధాకర్, బొల్లాడి శ్రీనివాస్ రెడ్డి, ముక్కెర మల్లేశం, ఆకుల శంకరయ్య, రాచూరి మల్లేశం, ఎండీ నజీర్, శ్రీమల్ల మేఘరాజు, పంజాల ఆంజనేయులు, వడ్లూరి ఆదిమల్లు, జోగు లక్ష్మీరాజం, గడ్డం స్వామి, గర్వాంధుల పరుశురాములు, గంగాధర సంపత్, ఇరుగురాల తిరుపతి, మామిడిపల్లి అఖిల్, ఈర్ల మహిపాల్, గుంటుకు ఆంజనేయులు, పెంచాల పురుషోత్తం, గుడిసె తిరుపతి, సాయిల్ల సంతోష్ తదితరులు పాల్గొన్నారు.