TGNPDCL | పెద్దపల్లిరూరల్ జూన్ 03: ఉద్యోగులంతా పరిస్థితులకనుగుణంగా ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని టీజీ ఎన్ పిడీసీఎల్ ఎస్ఈ కంకటి మాధవరావు అన్నారు. పెద్దపల్లి మంలంలోని రాఘవాపూర్ సబ్ స్టేషన్ లో గల టీజీఎన్ పీడీసిఎల్ ఎస్ఈ కార్యాలయ సమావేశ మందిరంలో మంగళవారం ఉద్యోగులందరికీ కరీంనగర్ మెడికవర్ దవఖాన ఆద్వర్యంలో ఉచితంగా వైద్యపరీక్షలు నిర్వహించారు. ఈ శిభిరాన్ని ఎన్పిడిసిఎల్ ఎస్ఈ మాధవరావు ప్రారంభించారు.
ఈ శిబిరంలో 120 మందికి మెడికవర్ కార్డియాలజిస్టు డాక్టర్ అనీష్పబ్బ, జనరల్ ఫిజీషియన్ డాక్టర్ లోకేష్ వైద్య పరీక్షలు చేశారు. గుండె వ్యాధులు, సాదారణ వ్యాధుల పట్ల అవగాహన కల్పించారు. అవసరమైన వారికి షుగర్, బీపీ, ఈసీజీ, 2డి ఎకో పరీక్షలు చేపట్టి రోగనిర్దారణ చేశారు. ఈ సందర్భంగా మెడికవర్ ఆసుపత్రి సెంటర్ హెడ్ గుర్రం కిరణ్ మాట్లాడుతూ ఎన్పిడిసిఎల్ ఉద్యోగులు, సిబ్బందికి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతోనే ఈ ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించినట్లు తెలిపారు. మెడికవర్ ఆసుపత్రిలో 24 గంటల పాటు అన్ని రకాల సూపర్ స్పెషాలిటీ సేవలు అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు. ఈ శిబిరంలో ఎన్పిడిసిఎల్ డీఈలు రవి, తిరుపతి, ఉద్యోగులు, సిబ్బంది, ఆసుపత్రి మార్కెటింగ్ మేనేజర్ కోట కరుణాకర్, బొంగోని హరీష్, శ్రీనవాస్ తదితరులు పాల్గొన్నారు.