చొప్పదండి, ఆగస్టు 3: మండలంలోని భూపాలపట్నం, కాట్నపల్లి గ్రామాల్లో గురువారం విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు వేశారు. భూపాలపట్నంలో నిర్వహించిన కార్యక్రమానికి జడ్పీటీసీ మాచర్ల సౌజన్య-వినయ్ హాజరై పిల్లలకు ఆల్బెండజోల్ మాత్రలు వేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఏడాది నుంచి 19 ఏళ్లలోపు పిల్లలకు ఆల్బెండజోల్ మాత్ర వేయించాలని తల్లిదండ్రులను కోరారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ మునిగాల విజయలక్ష్మి, సర్పంచ్ లావణ్య, ఉపసర్పంచులు కిట్టుగౌడ్, ఇప్ప శ్రీనివాస్‌రెడ్డి, డాక్టర్ రమాదేవి పాల్గొన్నారు. అలాగే, చొప్పదండి జడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థినులకు మున్సిపల్ చైర్ పర్సన్ గుర్రం నీరజ ఆల్బెండజోల్ మాత్రలు వేశారు. కార్యక్రమంలో పీహెచ్సీ వైద్యురాలు రమాదేవి, ఆశ వరర్లు, హెల్త్ అసిస్టెంట్లు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
రామడుగు, ఆగస్టు 3: మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు వేశారు. మండల కేంద్రంతో పాటు గోపాల్రావుపేట జడ్పీ ఉన్నత పాఠశాలల్లో విద్యార్థులకు ఎంపీపీ కలిగేటి కవిత-లక్ష్మణ్ ఆల్బెండజోల్ మాత్రలు వేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ, 19 ఏండ్లలోపు పిల్లలకు ఆల్బెండజోల్ మాత్రలు వేయించాలని తల్లిదండ్రులను కోరారు. రామడుగు, గోపాల్రావుపేట పీహెచ్‌సీల వైద్యాధికారులు డా.రమేశ్, డా.గ్రీష్మానియా మాట్లాడుతూ, నులిపురుగుల ద్వారా పిల్లల్లో ఆకలి మందగిస్తుందన్నారు. ఈ కార్యక్రమాల్లో సర్పంచులు పంజాల ప్రమీల-జగన్మోహన్గౌడ్, కర్ర సత్యప్రసన్న, మాజీ ఎంపీపీ మార్కొండ కిష్టారెడ్డి, ప్రధానోపాధ్యాయులు హేనా హెరియట్, ప్రకాశ్, ఆరోగ్య సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
విద్యానగర్, ఆగస్టు 3: వావిలాలపల్లిలోని అల్ఫోర్స్ సూల్ ఆఫ్ జెన్ నెక్ట్స్‌లో విద్యార్థులకు విద్యాసంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డి, కార్పొరేటర్ కోటగిరి భూమాగౌడ్ ఆధ్వర్యంలో పీహెచ్సీ సిబ్బంది ఆల్బెండజోల్ మాత్రలు వేశారు. ఇక్కడ పీహెచ్సీ సిబ్బంది, ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
గంగాధర, ఆగస్టు 3: మండలంలోని బూరుగుపల్లి, కురిక్యాల ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు వేశారు. మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సాగి మహిపాల్‌రావు, సర్పంచ్ మేచినేని నవీన్‌రావు, ఉపాధ్యాయులు, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.
కార్పొరేషన్, ఆగస్టు 3: ఏడాది నుంచి 19 ఏళ్లలోపు పిల్లలకు ఆల్బెండజోల్ మాత్రలు వేయించాలని కార్పొరేటర్ ఎదుర్ల రాజశేఖర్ తల్లిదండ్రులకు సూచించారు. 19వ డివిజన్ (షేకాబీకాలనీ)లోని అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు ఆయన ఆల్బెండజోల్ మాత్రలు వేశారు. కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ శైలజ, బస్తీ దవాఖాన డాక్టర్ మౌల్య, ఏఎన్ఎం హలీమా, ఆశ వరర్లు విజయలక్ష్మి, సువర్ణ తదితరులు పాల్గొన్నారు.
కొత్తపల్లి, ఆగస్టు 3: కొత్తపల్లి జడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు మున్సిపల్ చైర్మన్ రుద్ర రాజు ఆల్బెండజోల్ మాత్రలు వేశారు. కార్యక్రమంలో పీహెచ్సీ సూపర్వైజర్లు చంద్రలీల, ఉమ, ఆశ వరర్లు, హెల్త్ అసిస్టెంట్లు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.