ALaya Foundation | వీణవంక, సెప్టెంబర్ 12 : వీణవంక మండలంలోని వల్బాపూర్ గ్రామానికి చెందిన చేనేత కార్మికుడు బూర శ్రీనివాస్ ఇటీవల అనారోగ్యంతో మృతిచెందాడు. కాగా విషయం తెలుసుకున్న ఆలయ ఫౌండేషన్ సభ్యులు మృతుడి కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసి వారి ఉదారతను చాటుకున్నారు. ఆలయ ఫౌండేషన్ మార్గదర్శకుడు పరికిపండ్ల నరహరి దృష్టికి ఆ సంస్థ సభ్యులు తీసుకెళ్లారు.
కాగా ఆయన రూ.10వేలు పంపించగా ఆ సంస్థ కో-ఆర్డినేటర్ గాదె గుణసాగర్ గురువారం మృతుడి ఇంటికి వెళ్లి మృతుడి కుటుంబ సభ్యులకు అందజేశారు. మృతుడి చిత్రపటానికి పూలమాల వేసి, నివాళులు అర్పించి, ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు బూర పోశెట్టి, బూర శ్రీనివాస్, నామిని విజేందర్ తదితరులు పాల్గొన్నారు.